కేజ్రీవాల్ అసలు రూపం ఇదే.. స్వాతిమాలివాల్ పై నేపథ్యంలో జైలు నుంచి సుఖేశ్ సంచలన లేఖ

by Prasad Jukanti |
కేజ్రీవాల్ అసలు రూపం ఇదే..  స్వాతిమాలివాల్ పై నేపథ్యంలో జైలు నుంచి సుఖేశ్ సంచలన లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో:రూ.200 కోట్ల మోసం ఆరోపణలపై మండోలి జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ మరో లేఖను విడుదల చేశారు. ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ పై అర్వింద్ కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్ బిభవ్ కుమార్ దాడి చేసిన ఘటనలో అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తూ జైలు నుంచి లేఖలు రిలీజ్ చేశాడు. మిమ్మల్ని ఆరాధించే మహిళపై మీరు దాడి చేసినందకు సిగ్గుపడండి. ఆమె మీ తప్పుడు చర్యలలో ఒక అంశంపై తన స్వరాన్ని పెంచినందుకే మీరు ఆమె పై దాడి చేసే స్థాయికి దిగజారారు. మీ అసలు రంగు ఇదే అంటూ లేఖలో విమర్శలు గుప్పించారు. ఈ అసలు రంగుల్లో ఒకటి బహిర్గతం చేసినందుకు ముందుగా చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏ స్త్రీ పైన చేతులు ఎత్తే హక్కు మీకు లేదు. మీ ఇంట్లో మహిళలు ఉన్నారు, మీకు ఒక కుమార్తె ఉంది. మీరు ఆమెతో ఎలా ప్రవర్తిస్తారో నేను చూశాను. స్వాతి మలివావల్ కూడా ఒక కుమార్తె లాంటిదే. ఆమె ఈ దేశానికి చెందిన వ్యక్తి. ఆమెతో మీరు వ్యవహరించిన తీరు క్షమించరానిదన్నారు. మహిళలపై జరిగిన ఈ క్రూరమైన చర్యను సుమోటోగా స్వీకరించి కేజ్రీవాల్ మరియు అతని అనుచరుడు బిభవ్ కుమార్‌ కు చట్టప్రకారం శిక్ష విధించేలా దర్యాప్తు చేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు హోం శాఖకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

కేజ్రీవాల్ అంతా డ్రామా:

కేజ్రీవాల్ ఆడవారి పట్ల నకిలీ గౌరవాన్ని ప్రధర్శిస్తారని, అలాగే అతను నేర మనస్తత్వం కలిగినవాడని ఈ లేఖలో ఆరోపించారు. స్వాతి మలివాల్ ఢిల్లీలో మహిళల సంక్షేమం కోసం అహోరాత్రులు పోరాడి నిలబడిన మహిళ. అలాంటి మహిళ అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే ఈ విధంగా దాడికి గురైందంటే ఆప్ తన భావజాలాన్ని స్పష్టంగా రుజువు చేస్తోందని ఎవరైనా కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తే ఇదే జరుగుతుందని ఈ విషయం ప్రతిఒక్కరూ తెలుసుకోవాలన్నారు. బిభవ్ కుమార్ అవినీతిపరుడని అతడు కేజ్రీవాల్ కు అత్యంత క్రూరమైన అనుచరుడని పేర్కొన్నారు. 2022లో నేను కేజ్రీవాల్, సతీందర్ జైన్ సిండికేట్‌లను బహిర్గతం చేయడం ప్రారంభించినందున నన్ను కూడా చాలాసార్లు బెదిరించాడని ఆరోపించారు. ఈ ఆపరేషన్ విధానం తెలిసినందునే బిభవ్ కుమార్ స్వాతిపై దాడి చేశారని తాను ఖచ్చితంగా భావిస్తున్నానని మీరు u/s 120-Bకి స్పష్టంగా బాధ్యత వహిస్తారని అన్నారు. ఈ ఘటనను ఎంత కప్పిపుచ్చడానికి ప్రయత్నించినా విచారణలో అన్ని బహిర్గతం అవుతాయన్నారు. మధ్యంతర బెయిల్ పై ఉన్నప్పుడు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నేరం చేస్తే అది బెయిల్ దుర్వినియోగం కిందకే వస్తుందని ఈ ఘటన మీ బెయిల్ రద్దు చేయడాని అర్హమైనదన్నారు.

Advertisement

Next Story

Most Viewed