ముఖంపై మూడు రంగుల జెండా.. గోల్డెన్ టెంపుల్ గార్డ్ వివాదాస్పద వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |
ముఖంపై మూడు రంగుల జెండా.. గోల్డెన్ టెంపుల్ గార్డ్ వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పంజాబ్‌లోని గోల్డెన్ టెంపుల్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆలయాన్ని చూసేందుకు వచ్చిన ఓ యువతి ముఖంపై భారత జాతీయ జెండా ఉందనే కారణంతో ఆమెను టెంపుల్ గార్డ్ అడ్డుకోవడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తన ముఖంపై మూడు రంగుల జెండా పెయింటింగ్ వెయించుకున్న ఓ యువతి గోల్డెన్ టెంపుల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ప్రవేశ ద్వారాం వద్ద ఉన్న ఓ గార్డ్ ఆమెను అడ్డుకున్నాడు. తన చెంపకు ఉన్న ఆ రంగులేంటని అడగ్గా అది జాతీ జెండా రంగులని ఆమె సమాధానం ఇచ్చింది. దీంతో సదరు వ్యక్తి ఆమెను ఆలయం లోపలికి వెళ్లడానికి నిరాకరించాడు. ఈక్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ముఖంపై జాతీయ జెండా ఉండే అభ్యంతరం ఏంటని ఇది ఇండియా కాదా అని మరో వ్యక్తి ప్రశ్నించగా ఇది ఇండియా కాదని పంజాబ్ అని సదరు గార్డ్ బదులివ్వడం హాట్ టాపిక్ అయింది. ఈ ఘటనపై గోల్డెన్ టెంపుల్‌ను నిర్వహించే శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ స్పందించింది. యువతి పట్ల అధికారి దురుసుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరింది. అయితే మహిళ ముఖంపై ఉన్న పెయింటింగ్‌లో అశోక చక్రం లేదని అందువల్ల అది జాతీయ జెండా కాదని పేర్కొంది. ఏదైనా పార్టీ జెండా అయి ఉండవచ్చని ఎస్‌జీపీసీ ప్రధాన కార్యదర్శి గురు చరణ్ సింగ్ గ్రేవాల్ తెలిపారు. కాగా ఖలిస్తాన్ ఏర్పాటు కోసం ఆ రాష్ట్రంలో 'వారిస్ పంజాబ్ దే' పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న తరుణంలో పంజాబ్ ఇండియాలో లేదని గోల్డెన్ టెంపుల్ గార్డ్ చేసిన కామెంట్స్ సంచలనం అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed