ఐఏఎస్ అవుదామనుకుని బ్లాక్ మెయిలర్ గా.. భార్య భర్తల బెడ్ రూమ్ వీడియో తీసి అడ్డంగా బుక్

by Prasad Jukanti |
ఐఏఎస్ అవుదామనుకుని బ్లాక్ మెయిలర్ గా.. భార్య భర్తల బెడ్ రూమ్ వీడియో తీసి అడ్డంగా బుక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: డాక్టర్ ను అవుదామనుకుని యాక్టర్ అయ్యానని చాలా మంది సినిమా రంగానికి చెందిన సెలబ్రెటీలు చెబుతుండటం వింటూనే ఉంటాం. కానీ ఓ యువకుడు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఎఎస్ అవుదామనుకుని చివరకు దొంగగా మారాడు. తాజాగా భార్యభర్తలు ప్రైవేట్ వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయబోయి అడ్డంగా బుక్కయ్యాడు. విచారణలో పోలీసులే ఆశ్చర్యపోయిన ఈ ఘటన చత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది. సీనియర్ పోలీసు అధికారి హేమ్ ప్రకాష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని అహివారా పట్టణానికి చెందిన సాహు అనే 28 ఏళ్ల యువకుడు యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు 2017-2018లో ఢిల్లీలో ఉన్నాడు. ఆ సమయంలో పరీక్షలో విఫలం అయ్యాక అతడు తిరిగి అహివారాలోని తన ఇంటికి వచ్చేశాడు. పరీక్ష తప్పడంతో తిరిగి చదువు మీద ఫోకస్ పెట్టాల్సిన సాహు.. పూర్తిగా ట్రాక్ తప్పి నేరాల బాట పట్టాడు. ఆరంభంలో మొబైల్ స్నాచింగ్ వంటి చిన్న చిన్న దొంగతనాలు ప్రారంభించిన అతడు.. చేసే పనిలో సోమరిగా ఉండేవాడని పోలీసులు తెలిపారు. అతడి దొంగతనాలన్ని దుర్గ్ ప్రాంతానికే పరిమితం అయ్యాయని అలాగే పదే పదే ఒకే ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవాడని తెలిపారు.

ఈ క్రమంలో గత వారం గత వారం సాహు దొంగతనం చేసేందుకు ఓ జంట ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ ఇంట్లో ఇదివరకే రెండు సార్లు చోరీ చేశాడు. మూడోసారి దొంగతనానికి ప్రయత్నిచాడు. ఇంట్లోకి చొరబడి ఏ వస్తువులు చోరీ చేయాలని వెతుకున్న సమయంలో ఆ ఇంట్లో ఉన్న జంట ఏకాంతంగా గడుపుతుడటం చూశాడు. వెంటనే బ్లాక్ మెయిల్ చేయాలనే ఆలోచన కలగడంతో వారిని వీడియో తీసిన సాహు వారిని బ్లాక్ మెయిక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనకు రూ. 10 లక్షలు ఇవ్వకపోతే మీ ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బబెదిరింపు సందేశాలు పంపించాడు. సాహు బ్లాక్ మెయిల్ తో తొలుత కంగారుపడిన సదరు జంట ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతలోని సీసీ టీపీ ఫుటేజీ పరిశీలించి నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణలో తన నేరాన్ని అతడు అంగీకరించడంతో పాటు తాను నేర ప్రపంచంలోకి ఎలా వచ్చానో వివరించడంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు.

Advertisement

Next Story