ప్రధాని మోడీ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు: ప్రియాంక గాంధీ

by S Gopi |
ప్రధాని మోడీ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు: ప్రియాంక గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అధికార బీజేపీపై విమర్శలు పెంచారు. ఈ క్రమంలోనే బుధవారం కేరళలోని వయనాడ్‌లో జరిగిన ర్యాలీ మాట్లాడిన ఆమె.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, వారి బీజేపీ నేతల ప్రసంగాలను గమనిస్తే అసంబద్ధమైన అంశాల గురించి మాట్లాడ్డం తెలుస్తుంది. ప్రజల సమస్యల గురించి, అభివృద్ధి గురించి, అసలు సమస్యల గురించి మాట్లాడరు. బీజేపీ నేతలు ముఖ్యమైన అంశాలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుందని విమర్శించారు. ప్రతిరోజూ ప్రజలకు సంబంధంలేని అంశాలను తెరపైకి తెచ్చి గందరగోళం సృష్టిస్తున్నారని ప్రియాంక గాంధీ ఆరోపణలు చేశారు. ప్రజల బాగు గురించి కాకుందా అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజల జీవితంతో సంబంధం లేని, పురోగతి, పెరుగుతున్న ధరలు, అధిక నిరుద్యోగం గురించి మాట్లాడరు. వారితో పాటు మీడియా కూడా వాస్తవ సమస్యల గురించి మాట్లాడకుండా చేయగలరు. నిజమైన సమస్యల నుంచి దృష్టి మళ్లించి, అసంబద్దమైన వాటి చుట్టూనే చర్చించేలా, అవే ఎన్నికల అంశాలుగా చూపుతున్నారని ప్రియాంక గాంధీ విమర్శలతో విరుచుకుపడ్డారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరించడంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు లోక్‌సభ ఎన్నికలు ప్రజలకున్న ఒక అవకాశమని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed