- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది: ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై విమర్శల వేగాన్ని పెంచారు. మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో పాటు రాహుల్ గాంధీపై ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దక్షిణ గోవా అభ్యర్థి వ్యాఖ్యలను ప్రస్తావించిన మోడీ.. వారు రాజ్యాంగాన్ని అవమానించారని, దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పోర్చుగీస్ పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత గోవాపై భారత రాజ్యాంగం బలవంతంగా ప్రయోగించబడిందని, 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి తాను ఈ విషయాన్ని చెప్పినట్లు కాంగ్రెస్ సౌత్ గోవా అభ్యర్థి విరియాటో ఫెర్నాండెజ్ సోమవారం బహిరంగ సభలో ప్రసంగించారు. దీనిపై మాట్లాడిన మోడీ.. 'కాంగ్రెస్ గోవా అభ్యర్థి ఆ రాష్ట్రానికి భారత రాజ్యాంగం వర్తించదని చెప్పారు. గోవాపై రాజ్యాంగం బలవంతంగా అమలు చేస్తున్నట్టు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయాన్ని గతంలో యువరాజు(రాహుల్ గాంధీ)తో చెప్పానని కూడా అన్నారు. ఇది బాబాసాహేబ్ అంబేడ్కర్‌ను, రాజ్యాంగాన్ని అవమానించడం కాదా? ఇది రాజ్యాంగ వ్యవహారంలో అనవసర జోక్యం కాదా? ఇదంతా దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగమే. ఈరోజు గోవాలో రాజ్యాంగాన్ని నిరాకరిస్తున్నారు. రేపు దేశమంతటా బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని తిరస్కరించేందుకు ప్రయత్నిస్తారని ' మోడీ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంసంగా మారాయి.