కాంగ్రెస్‌ ఎమ్మెల్యే‌పై సైనా నెహ్వాల్ ఫైర్.. ఎందుకో తెలుసా ?

by Hajipasha |
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే‌పై సైనా నెహ్వాల్ ఫైర్.. ఎందుకో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : అది కర్ణాటకలోని దావణగెరే లోక్ సభ స్థానం. ఇక్కడి నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న జీఎం సిద్దేశ్వరకు ఈసారి టికెట్ దక్కలేదు. కానీ సిద్దేశ్వర భార్య గాయత్రి సిద్దేశ్వరను కమలదళం ఎన్నికల బరిలోకి దింపింది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే శివశంకరప్ప కోడలు ప్రభా మల్లికార్జున్‌కు అవకాశం లభించింది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు కూడా మహిళా అభ్యర్థులే అనే విషయం తెలిసినప్పటికీ.. మహిళా లోకాన్ని టార్గెట్ చేసేలా శివశంకరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాయత్రి సిద్దేశ్వరను ఉద్దేశించి శివశంకరప్ప మాట్లాడుతూ.. ‘‘ఆమెకు సరిగ్గా మాట్లాడటం కూడా రాదు. కేవలం కిచెన్‌లో ఎలా వంట చేయాలో మాత్రమే తెలుసు. ఆమె దానికే సరిగ్గా సరిపోతారు’’ అని కామెంట్ చేశారు. ఇది కాస్తా తీవ్ర దుమారానికి దారితీసింది. దీనిపై గాయత్రి సిద్దేశ్వర కూడా ఘాటుగా స్పందించారు. ‘‘ఈ రోజు ఆడవాళ్లు అన్ని వృత్తులలోనూ ఉన్నారు. ఆకాశంలో కూడా ఎగురుతున్నాం. ఆడవాళ్లు ఎంత అభివృద్ధి చెందారో వయసు అయిపోయిన అతనికి తెలియదు. అంతెందుకు ఆడవాళ్లందరూ ఇంట్లో మగవాళ్లు, పిల్లలు, పెద్దవాళ్లకు ఎంత ప్రేమతో వంట చేస్తారో కూడా తెలియదు’’ అంటూ ఆమె స్ట్రాంగ్ మెసేజ్ పంపారు. ఇక కాంగ్రెస్‌ నేత వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది.మహిళలు కిచెన్‌కే పరిమితం కావాలన్న కాంగ్రెస్ సీనియర్ నేత శివశంకరప్ప వ్యాఖ్యలపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇది నారీశక్తికి అవమానం. ఇలాంటి ఆలోచనా ధోరణి నుంచి బయటపడాలి’’ అని ఆమె సూచించారు.

Advertisement

Next Story

Most Viewed