వీళ్లకు 'గడ్డం' సెంటిమెంట్ బాగానే వర్కవుట్ అయింది..!

by Javid Pasha |   ( Updated:2023-02-01 17:23:41.0  )
వీళ్లకు గడ్డం సెంటిమెంట్  బాగానే వర్కవుట్ అయింది..!
X

దిశ, వెబ్ డెస్క్: ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. దాన్ని వాళ్లు బాగా నమ్ముతారు. చాలా సందర్భాల్లో వాళ్ల సెంటిమెంట్ వాళ్లకు కలిసి వస్తుంటుంది కూడా. ఇక సెంటిమెంట్ల విషయానికొస్తే గుళ్లకు వెళ్లడం, నచ్చిన ప్రదేశానికి వెళ్లడం, ఏదైనా పండుగ చేసుకోవడం, నచ్చిన రంగు దుస్తులు వేసుకోవడం.. ఇలా చాలానే ఉంటాయి. ఇక ఈ సెంటిమెంట్ సామాన్యుల నుంచి దేశ ప్రధానుల వరకు ఉంటుంది. ఇక విషయానికొస్తే ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులకు 'గడ్డం' సెంటిమెంట్ గా మారింది. సర్పంచ్ మొదలు కొని దేశ ప్రధాని వరకు ఈ సెంటిమెంట్ ఉంది. ఇక రాజకీయ ప్రముఖుల్లో 'గడ్డం'పై సెంటిమెంట్ ను పాటిస్తున్న ప్రముఖులు వీళ్లే..


1. నరేంద్ర మోడీ (భారత ప్రధాన మంత్రి)

ప్రస్తుతం దేశ రాజకీయాలను ఒంటి చేత్తో శాసిస్తున్న అత్యంత శక్తమంతమైన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ. మోడీకి మొదటి నుంచి కూడా గడ్డం అనేది సెంటిమెంట్ గా వస్తోంది. అయితే దేశ ప్రధానిగా 2014లో బాధ్యతలు తీసుకున్న తర్వాత మోడీ గడ్డం బాగా ఫేమస్ అయింది. ఆయన కొంతకాలం పాటు రవీంద్రనాథ్ టాగూర్ స్టైల్ గడ్డాన్ని మెయింటెన్ చేశారు. ప్రస్తుతం ఆయన సొంత స్టైల్ గడ్డాన్ని కొనసాగిస్తున్నారు.


2. రాహుల్ గాంధీ (ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు)

దేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని రాజకీయ కుటుంబ నేపథ్యం రాహుల్ గాంధీ సొంతం. ఆయన తాత నెహ్రూ, నానమ్మ ఇందిరాగాంధీ, నాన్న రాజీవ్ గాంధీ, తల్లి సోనియా.. ఇలా అందరూ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పినవారే. వాళ్ల రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తోన్న రాహల్ గాంధీకి కూడా 'గడ్డం' సెంటిమెంట్ కలిసొచ్చిందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఎప్పుడూ క్లీన్ షేవ్ లో కినిపించే రాహుల్.. భారత్ జోడో యాత్ర సందర్భంగా ఫుల్ గడ్డంలో కనిపించారు. ఇటీవల ఆయన తన యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ యాత్ర తర్వాత రాహుల్ ఇమేజ్ చాలా వరకు పెరిగిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మోడీ లాగే రాహుల్ కు కూడా గడ్డం సెంటిమెంట్ వర్కవుట్ అయిందని అంతా అనుకుంటున్నారు.


3. నారా చంద్రబాబు నాయుడు (మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు)

ఏపీకి మూడు సార్లు సీఎంగా వ్యవహరించిన అపార అనుభవం చంద్రబాబు కు సొంతం. ప్రస్తుతం ఆయన ఏపీ ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. చంద్రబాబు అనగానే అందరికి గుర్తొచ్చేది ఆయన గడ్డం. ఆయన గడ్డంపై ప్రత్యర్థి నాయకులు ఎన్నో విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్న బాబు.. దాదాపు 3 దశాబ్దాలుగా గడ్డం పెంచుతున్నారు. ఈ 30 ఏళ్లలో ఏనాడా ఆయన గడ్డం లేకుండా ప్రజల్లో కనిపించిన సందర్భాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఇక ఆయన గడ్డానికి బిల్ క్లింటన్, బిల్ గేట్స్ మొదలుకొని నేటి యువత వరకు ఫ్యాన్స్ ఉన్నారు.



4. రేవంత్ రెడ్డి (టీపీసీసీ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ)

ప్రత్యర్థులను తన వాగ్దాటితో ఇబ్బందిపెట్టే రేవంత్ రెడ్డికి కూడా 'గడ్డం' సెంటిమెంట్ ఉంది. ఆయన ఎమ్మల్సీగా గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా పాప్ లర్ అయిన దగ్గర నుంచి పీసీసీ ప్రెసిడెంట్ అయిన ప్రస్తుత కాలం వరకు.. రేవంత్ ఎక్కువగా గడ్డంలోనే కనిపిస్తుంటారు. రాజకీయ వేదికల మీద మీసాలు మెలేస్తూ సవాలు విసిరి రేవంత్ మాట్లాడుతోంటే యువకుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంటుంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గమైన మల్కాజ్ గిరికి ఎంపీగా ఉన్నారు.


5.బండి సంజయ్ కుమార్ (బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ)

బండి సంజయ్.. రాష్ట్రంలో ఈ పేరు తెలియనివారుండరు అంటే అతిశయోక్తి కాదు. అనతి కాలంలోనే దేశంలోనే అతిపెద్ద పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎదిగాడు. తన పంచులతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ నాయకులను ఇరుకున పెట్టడంలో బండి సంజయ్ తనకు తానే సాటి. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఆయన రాష్ట్రమంతా కలియతిరిగారు. ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిషలు కృషి చేస్తున్నారు. ఇక బండి సంజయ్ కు కూడా గడ్డం సెంటిమెంట్ ఉంది. ఆయన కూడా ఎప్పుడు గడ్డంలోనే కనిపిస్తుంటారు.


6. ఉత్తమ్ కుమార్ రెడ్డి (టీపీసీసీ మాజీ ప్రెసిడెంట్, నల్గొండ ఎంపీ)

ఇక భారత వైమానిక దళంలో పని చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రాజకీయాల్లోకి వచ్చాక తన లుక్ ను కంప్లీట్ గా మార్చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం పెంచేవారు కారు. కానీ టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక తాను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదాక గడ్డం తీయనని ఒకానొక సందర్భంలో సవాలు చేశారు. ఆయన అలా అన్న కొద్ది రోజులకే టీఆర్ఎస్ రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చింది.. ఆ తర్వాత పరిణామాల్లో ఆయన పీసీసీ పదవీ పోయింది. కానీ గడ్డం పెంచడం మాత్రం అలాగే కొనసాగిస్తున్నారు. బహుశా ఆయన అన్నట్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదాక తన గడ్డాన్ని తీయరేమో వేచి చూడాలి మరి.


7. విరాట్ కోహ్లీ (ప్రముఖ క్రికెటర్)

ఇక రాజకీయ నాయకులే కాకుండా క్రీడా రంగంలో కూడా చాలా మంది రకరకాల స్టైల్ లో గడ్డం పెంచుతుంటారు. వాళ్లలో టాప్ లో ఉంటాడు విరాట్ కోహ్లీ. భారత క్రీడా రంగంలో విరాట్ కోహ్లీ అంటే తెలియనవారుండరు. ఫ్యాన్య్ అతడిని ముద్దుగా కింగ్ కోహ్లీ అని పిలుస్తుంటారు. క్రికెట్ లో సచన్ తర్వాత అంత గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి కోహ్లీ అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే కోహ్లీ ఎన్నో రికార్డులను తన పేరు మీద నెలకొల్పాడు. ఇక విషయానికొస్తే.. గేమ్ లో ఎంత స్టైలీష్ గా ఉంటాడో బయట అదే మెయింటెన్ చేస్తాడు. సాకర్ ఆటగాళ్ల తర్వాత అంత స్టైల్ గా, ఫ్యాషన్ ఐకాన్ గా కోహ్లీ మారాడనడంలో ఎలాంటి అబద్దం లేదు. ఇక కోహ్లీకి కూడా గడ్డం సెంటిమెంట్ ఉంది. ఆయన డిఫరెంట్ బియర్డ్ తో కనిపిస్తుంటాడు. ఇక ఆయన గడ్డానికి ఫిదా అయ్యే కాబోలు బాలీవుడ్ అందాల తార అనుష్క శర్మ అతడిపై మనసు పారేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed