భారత్ లో అక్కడే ఎక్కువ మరణాలు : నితిన్ ఘడ్కరీ సంచలన వ్యాఖ్యలు

by M.Rajitha |
భారత్ లో అక్కడే ఎక్కువ మరణాలు : నితిన్ ఘడ్కరీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : రోడ్డు ప్రమాదాల మీద కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ ఘడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లో యుద్ధం, ఉగ్రవాదం, నక్సలిజంలో మరణించే వారి కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మరణిస్తున్నారని అన్నారు. ఫిక్కీ రోడ్ సేఫ్టీ అవార్డ్స్, కాంక్లేవ్-2024 కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఘడ్కరీ.. భారత్ లో రోడ్డు ప్రమాదాలు తనని కలవర పరుస్తున్నాయని అన్నారు. ప్రతి ఏటా 5 లక్షల మంది రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిలో లక్షన్నరకు పైగా అక్కడిక్కడే చనిపోతున్నారని, మరో మూడు లక్షల మంది గాయాలతో ఆస్పత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేశ జీడీపీకి 3% వరకు నష్టాన్ని కలిగిస్తోందని అన్నారు. రోడ్డు నిర్వహణ మీద, పనుల మీద ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఆడిట్ చేపట్టాలని సూచించారు. ఆధునిక సాంకేతికతను, యంత్రాలను వాడటంలో శిక్షణ ఇవ్వాలని, అప్పుడే మెరుగైన రహదారులు సాధ్యపడవచ్చునని అభిప్రాయపడ్డారు. ఇక చాలామంది రోడ్డు ప్రమాదలకు కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యం అని నింద వేస్తారు గాని నిజానికి రోడ్డు ఇంజనీరింగులో కూడా చాలా లోపలున్నాయని పేర్కొన్నారు.

Next Story

Most Viewed