- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Reels Death:ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి..ఆ వీడియో చేస్తూ లోయలో పడి యువతి మృతి
దిశ,వెబ్‌డెస్క్: ఇటీవలి కాలంలో రీల్స్ పిచ్చి మరింత ఎక్కువైపోతుంది. చాలామంది సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫుల్ ఫేమస్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో ప్రమాదకర స్టంట్స్‌తో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అంతే కాదు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి. వాటిని చూసి తమ పిల్లలు కూడా ప్రయత్నించి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారేమోనని తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. అయితే కొందరు రీల్స్ చేసి తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటుంటే మరి కొందరు మాత్రం రీల్స్ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ముంబైలో వెలుగులోకి వచ్చింది. అసలు విషయంలోకి వెళితే..ముంబైకి చెందిన ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ అన్వీ కామ్‌దార్(26) స్నేహితులతో రాయ్‌గడలోని కుంభే జలపాతానికి వెళ్లారు. ఆ ప్రదేశంలో ఆమెకు రీల్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఆలోచన వచ్చింది. దీంతో ఆమె అక్కడ రీల్స్ చేసేందుకు లోయ అంచున నిలబడగా కాలు జారి 300 అడుగుల లోయలో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది 6 గంటలు కష్టపడి అన్వీని కాపాడారు. కానీ ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్చిన కాసేపటికి మరణించారు. అన్వీకి సోషల్ మీడియాలో 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.