- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాదాస్పద అంశాలను న్యాయశాస్త్ర కోర్సులో చేర్చం: కేంద్ర విద్యాశాఖ మంత్రి
దిశ, నేషనల్ బ్యూరో: న్యాయ విద్య చదువుతున్న విద్యార్థులకు ప్రాచీన భారతీయ గ్రంథం మనుస్మృతిని బోధించాలనే ప్రతిపాదనపై వివాదం చెలరేగిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి వివాదాస్పద అంశాలను న్యాయశాస్త్ర కోర్సులో చేర్చుకోబోమని ప్రకటించారు. శుక్రవారం ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, న్యాయ విద్య చదువుతున్న వారికి మనుస్మృతి బోధించాలని ప్రతిపాదనలు వచ్చాయని మాకు సమాచారం వచ్చింది. అయితే దీనిని, ఇంతకుముందే ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్వయంగా ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. మన రాజ్యాంగానికి, భవిష్యత్ విధానానికి కట్టుబడి ఉన్నాము. ఏ పాఠంలో అయిన వివాదాస్పదమైన భాగాన్ని చేర్చే ప్రశ్నే లేదు, రాజ్యాంగంలోని నిజమైన స్ఫూర్తిని, అక్షరాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే న్యాయ విద్యార్థుల సెలబస్‌లో మార్పులు చేయాలని, విద్యార్థులకు మనుస్మృతి బోధించాలని లా ఫ్యాకల్టీ భావించారు, ఈ ప్రతిపాదనను ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యోగేష్ సింగ్ నేతృత్వంలోని కమిటీ ముందు ఉంచగా, దీనిని తిరస్కరించారు.