బిగ్ న్యూస్: BJP వరుస విజయాలకు ఆ సెంటిమెంటే కారణం.. మరో రెండు రాష్ట్రాల్లోనూ ఇదే ఫార్ములా ఇంప్లిమెంట్..?

by Satheesh |
బిగ్ న్యూస్: BJP వరుస విజయాలకు ఆ సెంటిమెంటే కారణం.. మరో రెండు రాష్ట్రాల్లోనూ ఇదే ఫార్ములా ఇంప్లిమెంట్..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈశాన్య రాష్ట్రాల ఫలితాలు బీజేపీకి మంచి బూస్ట్ ఇస్తున్నాయి. నాగాలాండ్, త్రిపుర, మేఘాలయాల్లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. అయితే బీజేపీ జోరు వెనుక ఓ సెంటిమెంట్ వర్కౌట్ అవుతోందనే టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇదే సెంటిమెంట్‌ను త్వరలో ఎన్నికలు జరగబోయే కర్ణాటకతో పాటు మధ్యప్రదేశ్‌లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారా అనేది ఉత్కంఠగా మారింది.

పార్టీ గెలుపుకు సీఎంల మార్పు కమలం పార్టీలో సెటింమెంట్‌గా మారుతోంది. గత కొంత కాలంగా సీఎంని మార్చిన చోట్ల బీజేపీ జోరు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికలకు ముందు సీఎంను మార్చి భారీ విజయం నమోదు చేసుకున్న బీజేపీ.. త్రిపురలోనూ అదే వ్యూహాన్ని అమలు చేసి సక్సెస్ అయింది. సీఎం బిప్లబ్‌ను ఎన్నికలకు సరిగ్గా 10 నెలల ముందు మార్చి ఆయన స్థానంలో మానిక్ సాహాకు అవకాశం కల్పించింది.

దాంతో గురువారం వెలువడిన త్రిపుర ఫలితాల్లో బీజేపీ విజయం సాధించగలిగింది. ఉత్తరాఖండ్‌లో 2022 ఎన్నికలకు ముందు రెండు సార్లు సీఎంలను బీజేపీ అధిష్టానం మార్చింది. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీ ఓటమికి సీఎం మార్పు లేకపోవడమే అనే టాక్ వినిపించింది. అక్కడ ముఖ్యమంత్రిని మారిస్తే పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయాలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో సీఎంలను మార్చడం ద్వారా పార్టీ మెరుగైన ఫలితాన్ని సాధిస్తోందనే అంచాలు నెలకొనడంతో రాబోయే కర్ణాటక, మధ్యప్రదేశ్ ఎన్నికల కోసం సీఎంలను బీజేపీ పెద్దలు మారుస్తారా అనేది చర్చగా మారింది. ఇప్పటికిప్పుడు మార్పు లేకపోయినా ఎన్నికల ప్రచారంలో కొత్త సీఎం అభ్యర్థి పేరును ప్రకటించడం లేదా ఎన్నికల ఫలితాల అనంతరం అయినా కొత్త వారికి అవకాశం ఇస్తారనే చర్చ జోరందుకుంది.

కర్ణాటకలో 2021లో యడియూరప్పను మార్చి అతడి స్థానంలో బసవరాజు బొమ్మైను సీఎం సీట్లో కూర్చోబెట్టారు. అయితే బొమ్మైపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల అమిత్ షా కర్ణాటకలో పర్యటిస్తూ కర్ణాటక ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మోడీ, యడియూరప్పపై నమ్మకం ఉంచి బీజేపీ ఓట్లు వేయాలని కోరారు. సీఎంను కాకుండా యడియూరప్ప పేరును ప్రస్తావించడం కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తిని రేపింది. అయితే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని యడియూరప్ప ఇప్పటికే క్లారిటీ ఇచ్చినప్పటికీ సీఎంను మార్చే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారా అనే ఉత్కంఠ రేపుతోంది.

Advertisement

Next Story

Most Viewed