- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పండగపూట ఘోర విషాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
దిశ, వెబ్‌డెస్క్: ఇండోర్‌లోని బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో శ్రీరామనవమి రోజున భారీ ప్రమాదం జరిగింది. మెట్ల బావి పైకప్పు కూలడంతో బావిలో పడి ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. 40 అడుగుల లోతున్న మెట్ల బావిలో 25 మంది పడిపోయారు. పోలీసులు 18 మందిని తాళ్లతో బయటకు తీశారు. వీరిలో ఇద్దరు బాలికలు కాగా, ఆరుగురు మహిళలు ఉన్నారు. మరికొంత మంది చిక్కుకుపోయి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. మెట్టబావిలో నాలుగైదు అడుగుల నీరు ఉంది.
స్థానికుల వివరాల ప్రకారం.. సప్నా సంగీత రోడ్డులోని స్నేహ నగర్‌లో హవాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మెట్ల బావి డాబాపై 25 మందికి పైగా కూర్చున్నారు. అప్పుడు అధిక బరువు కారణంగా, దాని పైకప్పు విరిగిపోయి ప్రజలు పడిపోయారని అంటున్నారు. ఈ దేవాలయం సుమారు 60 సంవత్సరాల నాటిదని చెప్పుకొచ్చారు. అక్కడ కన్యాపూజ కార్యక్రమం ఉండడంతో గుడిలో రద్దీ నెలకొంది. విషయం తెలసుకొని వెంటనే మందిర్‌కు వచ్చిన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.