పంజాబ్‌లో క్షణం క్షణం భయం భయం.. కొనసాగుతున్న ఇంటర్నెట్ నిషేధం

by Mahesh |   ( Updated:2023-03-22 03:44:38.0  )
పంజాబ్‌లో క్షణం క్షణం భయం భయం.. కొనసాగుతున్న ఇంటర్నెట్ నిషేధం
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ రాష్ట్రంలో ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, పంజాబ్ వారిస్ దే చీఫ్ అమృతపాల్ సింగ్‌పై అణిచివేత నేపథ్యంలో ఆ రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరిగే అవకాశం ఉంది. దీంతో గత రెండు రోజుల నుంచి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఏ క్షణం ఏమౌతుందో తెలియక అటు అధికారులు, ఇటు సామాన్య ప్రజలు తీవ్ర భయంతో ఉన్నారు. ఈ క్రమంలోనే వేర్పాటు వాదులు యువతను రెచ్చగొట్టే విధంగా చేస్తారని ముందస్తుగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నెట్ వర్క్‌ల ఇంటర్నెట్ బంద్ చేశారు.

కాగా ఈ సస్పెన్షన్‌ని ఈ నెల 20 వరకు పొడిగిస్తు నిర్ణయం తీసుకున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ఆదివారం తెలిపింది. ఈ సస్పెన్షన్ అన్ని మొబైల్ ఇంటర్నెట్ సేవలు, SMS సేవలు (బ్యాంకింగ్ మరియు మొబైల్ రీఛార్జ్ మినహా), వాయిస్ కాల్‌లు మినహా మొబైల్ నెట్‌వర్క్‌లలో అందించబడిన అన్ని డాంగిల్ సేవలకు వర్తిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed