ఇండియా కూటమి నెక్స్ట్ మీటింగ్ ముంబైలో.. రెండు రోజుల పాటు సమావేశాలు

by Javid Pasha |
ఇండియా కూటమి నెక్స్ట్ మీటింగ్ ముంబైలో.. రెండు రోజుల పాటు సమావేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: లోక్ సభ ఎన్నికలకు కొన్ని నెలలే గడువు ఉన్న నేపథ్యంలో విపక్షాలు తమ స్పీడును పెంచాయి. ఇండియా కూటమిగా ఏర్పడ్డ విపక్షాలు తమ తదుపరి సమావేశాలను ముంబైలో నిర్వహించనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న రెండు రోజుల పాటు ఇండియా కూటమి సమావేశాలు జరగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే తెలిపారు. సమావేలకు సంబంధించిన ఏర్పట్లపై చర్చించామని, మహా వికాస్ అఘాడి ఆధ్వర్యంలో ఈ సమావేశాలను నిర్వహిచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశాలకు కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ, డీఎంకే, టీఎంసీ, ఆప్ తదితర పార్టీల అధినేతలు హాజరవుతారని చెప్పారు.

Advertisement

Next Story