కుక్కకు ‘నూరీ’ పేరు.. రాహుల్ గాంధీపై అసదుద్దీన్ ఫైర్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-06 06:22:01.0  )
కుక్కకు ‘నూరీ’ పేరు.. రాహుల్ గాంధీపై అసదుద్దీన్ ఫైర్!
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలో సోనియా గాంధీకి ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. గోవా నుంచి జాక్ రస్సెల్ టెర్రియర్ అనే కుక్కపిల్లను రాహుల్ తెచ్చి సోనియాకు బహుమతిగా ఇచ్చారు. దీనికి ‘నూరీ’ అనే పేరు పెట్టారు. అయితే ఇప్పుడు ఈ పేరే వివాదాస్పదంగా మారింది. ‘నూరీ’ అనేది ముస్లిం మహిళల పేరు అని పెట్ డాగ్‌కి ఈ పేరు పెట్టడం అంటే ముస్లిం అమ్మాయిలను అవమానించడమే అన్నారు. మరో ఎంఐఎం నేత మహమ్మద్ ఫర్హాన్ ఇదే అంశంపై స్పందిస్తూ ‘నూరి’ పేరు పెట్టి ముస్లిం మహిళలను అవమానించారన్నారు. దీన్ని మజ్లిస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. రాహుల్ గాంధీ తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఇలా పేరు పెట్టడంతో గాంధీ ఫ్యామిలీపై ముస్లిం సమాజంలో వ్యతిరేకత పెరుగుతుందన్నారు.

Advertisement
Next Story

Most Viewed