- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారీగా పెరిగిన వడ్డీ భారం.. మొత్తం బడ్జెట్ ఖర్చులో 24% వడ్డీలకే..!
దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న ఆర్థిక సంవత్సరానికి (2023-24) కేంద్ర ప్రభుత్వం అంచనా వేసిన రూ. 45.03 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌లో రూ. 17.98 లక్షల కోట్లను వివిధ రూపాల్లో అప్పుల ద్వారానే సమకూర్చుకోనున్నది. ఇందులో రిజర్వు బ్యాంకు ద్వారా మార్కెట్ బారోయింగ్ పేరుతో రూ. 12.30 లక్షల కోట్లను సమకూర్చుకోనున్నది. గతేడాదితో పోలిస్తే ఇది 72 వేల కోట్లు ఎక్కువ. ఇక గతంలో చేసిన అప్పులకు వడ్డీల చెల్లింపు కోసం వచ్చే సంవత్సరం రూ. 10.79 లక్షల కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది ఇది రూ. 9.40 లక్షల కోట్లు మాత్రమే ఉంటే ఈసారి రూ. 1.40 లక్షల కోట్లు ఎక్కువ. అంతకుముందు సంవత్సరం వడ్డీల చెల్లింపుకు రూ. 8.05 కోట్లనే ఖర్చుచేసింది. ఏటేటా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు పేరుకుపోతూ ఉన్నాయి. 'అసలు'ను తీర్చే సంగతి ఎలా ఉన్నా వడ్డీ భారం కూడా పెరుగుతూ ఉన్నది. మొత్తం బడ్జెట్ ఖర్చులో ఏకంగా 24% మేర వడ్డీల కోసమే చెల్లించాల్సి ఉన్నందున కేంద్రంపై రుణభారం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Budget 2023: పార్లమెంట్‌లో టంగ్ స్లిప్ అయిన Nirmala Sitharaman