BREAKING: మంత్రులకు శాఖలు కేటాయింపు.. బీజేపీ అగ్రనేతకు కేంద్ర హోంశాఖ పోస్ట్

by Satheesh |   ( Updated:2024-06-10 14:42:02.0  )
BREAKING: మంత్రులకు శాఖలు కేటాయింపు.. బీజేపీ అగ్రనేతకు కేంద్ర హోంశాఖ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కొలువుదీరింది. ప్రధాని మోడీతో పాటు మరో 72 మంది కేంద్ర మంత్రులుగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైన కేంద్ర మంత్రులకు ప్రభుత్వం శాఖలు కేటాయించింది. కేంద్ర హోంశాఖను మరోసారి అమిత్ షాకే ఇవ్వగా.. రక్షణ శాఖను మళ్లీ రాజ్ నాథ్ సింగ్‌కే కేటాయించారు. ఈ ఇద్దరు బీజేపీ అగ్రనేతలు శాఖల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. గత ప్రభుత్వంలో రోడ్డు రవాణా మంత్రిగా పని చేసిన నితీన్ గడ్కరీకే మరోసారి ఆ శాఖను కేటాయించారు. ఆర్థిక శాఖను మళ్లీ నిర్మలా సీతారామన్‌కే అప్పగించారు. కీలకమైన విదేశాంగ శాఖను మరోసారి జై శంకర్‌కే అలాట్ చేశారు. మోడీ కేబినెట్‌లో కీలకమైన హోం, రక్షణ, విదేశీ వ్యవహరాలు, ఆర్ధిక శాఖలను బీజేపీ వద్దే ఉంచుకుంది.

నరేంద్ర మోడీ 3.0 మంత్రుల శాఖలు:

అమిత్ షా= కేంద్ర హోంశాఖ

నితిన్ గడ్కరీ= రవాణా శాఖ

రాజ్‌నాథ్‌= రక్షణశాఖ

మనోహర్‌లాల్‌ కట్టర్‌= గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి

హర్దీప్‌సింగ్‌ పూరి-పెట్రోలియం,

అశ్విని వైష్ణవ్‌-రైల్వే, సమాచార, ప్రసారశాఖ,

పీయూష్‌ గోయల్‌- వాణిజ్యం

ధర్మేంద్ర ప్రధాన్‌-విద్యాశాఖ

నిర్మలాసీతారామన్‌= ఆర్థికశాఖ

జయశంకర్‌= విదేశాంగ శాఖ

జ్యోతిరాదిత్య సింధియా-టెలికాం శాఖ

ప్రహ్లాద్‌ జోషి-ఆహారం, వినియోగదారుల సేవలు

కుమారస్వామి-ఉక్కు, భారీ పరిశ్రమలు

సురేష్‌ గోపి - టూరిజం శాఖ సహాయమంత్రి

రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌-సాంస్కృతికశాఖ, పర్యాటక శాఖ సహాయమంత్రి

Advertisement

Next Story

Most Viewed