కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం తేదీలో మార్పు.. ఎప్పుడంటే..?

by Javid Pasha |   ( Updated:2023-05-14 12:57:55.0  )
కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం తేదీలో మార్పు.. ఎప్పుడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 136 సీట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటకలో ప్రచారం నిర్వహించారు. ఇక కర్ణాటక పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్, అక్కడి మాజీ సీఎం సిద్ధరామయ్య అన్ని తామై ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అహర్నిషలు కష్టపడ్డారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరిలో ఒకరికి సీఎం పదవి కట్టబెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఈ రోజు సీఎల్పీ భేటీ కానుంది. ఈ భేటీకి జాతీయ నాయకత్వం పరిశీలకులను పంపించింది.

ఇక మొదట రేపు (సోమవారం) కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తాజాగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఈ నెల 18కి మార్చినట్లు సమాచారం. సీఎం పోస్టు విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈ మూడు రోజుల వ్యవధిలో మొదట వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చి అనంతరం ఇద్దరిలో ఎవరినో ఒకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని గురువారానికి వాయిదా వేసినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed