ఆ భేటీకి తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరు

by Shiva |   ( Updated:2023-05-27 08:22:27.0  )
ఆ భేటీకి తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్‌ సమావేశానికి తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజయ్యారు.తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్థాన్ ముఖ్యమంత్రులు ఈ భేటీకి హాజరు కావట్లేదని సమాచారం అందించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని కొత్త కన్వెన్షన్ సెంటర్‌లో ‘వికసిత్ భారత్ - 2047’ అనే థీమ్‌తో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Advertisement

Next Story