- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలోని ఉల్లి రైతులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్!
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఉల్లిరైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో ఉల్లి ఎగుమతులపై నిషేదం విధించిన కేంద్రం.. తాజాగా ఆ నిషేదాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాక ఉల్లి ఎగుమతి ధరను టన్నుకు రూ.45,860 గా నిర్ధారించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉల్లి రైతులకు లాభం చేకూరనుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ఎక్సేంజ్ విడుదల చేసిన ఓ నోటిఫికేషన్ లో ఉల్లి ఎగుమతి ధర 500 డాలర్లుగా నిర్ణయించారు.
కాగా కేంద్ర ప్రభుత్వం ఉల్లిని పూర్తిగా నిషేదిత జాబితాలోకి చేర్చినప్పుడు శ్రీలంక , బంగ్లాదేశ్, యూఏఈ వంటి దేశాల అభ్యర్ధన మేరకు పరిమిత ఎగుమతులకు అనుమతించింది. అనంతరం ఉల్లిపై నిషేదాన్ని పూర్తిగా ఎత్తివేయాలని ఉల్లి వ్యాపారులు, రైతులు మఖ్యంగా మహారాష్ట్రకు చెందిన ఉల్లిరైతులు పలు మార్లు డిమాండ్ చేసినా దేశంలో ధరలు పెరుగుతాయనే కారణంతో కేంద్రం వారిపై కనికరం చూపలేదు. లోక్ సభ ఎన్నికల ముందు ఈ నిర్ణయం తీసుకోవడంతో ఉల్లి వ్యాపారులే కాక రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే 'దేశీ చనా'(బెంగాల్ గ్రామ్) ఉత్పత్తులు తగ్గిపోవడంతో వీటిని మార్చి 2025 వరకు దిగుమతి సుంకం నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించింది. గత నెలలో చనా ధరలు ఢిల్లీలో క్వింటాల్ రూ. 5,700తో పోలిస్తే 10% కంటే ఎక్కువ పెరిగి దాదాపు రూ.6,300కి చేరుకున్నాయి. అలాగే పసుపు బఠానీ దిగుమతి సుంకంపై ఇదివరకే జారీ చేసిన ప్రవేశ బిల్లు గడువు అక్టోబర్ 31, 2024 ను కేంద్రం మరోసారి పొడిగించింది. దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొన్న తరుణంలో ధరలు పెరగకుండా చూసేందుకు ప్రభుత్వం కీలకమైన ఆహార పదార్థాల ధరలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.