ముఖ్యమంత్రికి భారీ షాకిచ్చిన ఆటో డ్రైవర్

by srinivas |   ( Updated:2022-10-01 05:43:16.0  )
ముఖ్యమంత్రికి భారీ షాకిచ్చిన ఆటో డ్రైవర్
X

దిశ, వెబ్‌డెస్క్: త్వరలోనే గుజరాత్‌లో సాధారణ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకుంటామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కుండబద్దలు కొడుతున్నారు. ఇప్పటికే ప్రచారం కూడా మొదలు పెట్టారు. గత నెల 12న అహ్మదాబాద్‌లో నిర్వహించిన ఆఫ్ సభకు విక్రమ్ దంతాని అనే ఆటోడ్రైవర్ ఇతర డ్రైవర్స్ కూడా తీసుకెళ్ళాడు. అంతేకాకుండా సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను తన ఇంటికి విక్రమ్ ఆహ్వానించారు.దీనికి అంగీకరించిన కేజ్రీవాల్ తన ఇంటికి వెళ్లి భోజనం కూడా చేశారు.

అయితే విక్రమ్ దంతాని నిన్న అహ్మాదాబాద్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమంలోనూ పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇదేంటి అని మీడియా ప్రశ్నించగా.. నేను నిజానికి బీజేపీ అభిమానిని అని అన్నాడు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకే నా ఓటు అన్నాడు. కేజ్రీవాల్‌ను అతిథిగానే ఇంటికి పిలిచా అని తెలిపాడు. అంతే కాకుండా ఎప్పుడైనా ఏ ఆపద వచ్చినా నన్ను బీజేపీ నాయకులు ఆదుకుంటారని వెల్లడించారు.

Advertisement

Next Story