అందుకే రాజ్యసభనుంచి విపక్షాల వాకౌట్!.. వాకౌట్ అనంతరం కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సంచలన ట్వీట్

by Ramesh Goud |
అందుకే రాజ్యసభనుంచి విపక్షాల వాకౌట్!.. వాకౌట్ అనంతరం కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సంచలన ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడీ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని, మేము రాజ్యాంగానికి వ్యతిరేకం ఆయన వాదించారని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. దీనిపై ఖర్గే స్పందిస్తూ.. బీజేపీపై సంచలన విమర్శలు చేశారు. ప్రధాని మోదీ అబద్ధాలు చెబుతున్నారని భారత పార్టీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయని తెలిపారు. మేము రాజ్యాంగానికి వ్యతిరేకం అని ఆయన వాదిస్తున్నారు. కానీ బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్, జనసంఘ్ మరియు వారి రాజకీయ పూర్వీకులు భారత రాజ్యాంగాన్ని తీవ్రంగా వ్యతిరేకించారనేది నిజమని చెప్పారు. అలాగే ఆ సమయంలో వారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ దిష్టిబొమ్మలను దహనం చేశారని, ఇది సిగ్గుచేటు, ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించే అంశమని ఆయన పేర్కొన్నారు. అంతేగాక రాజ్యాంగాన్ని రూపొందించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీకి అందించారనేది నిజమని, నేను ఈ రెండు విషయాలను రాజ్యసభ ద్వారా భారతదేశ ప్రజలకు నొక్కి చెప్పవలసి వచ్చిందని, ఆ సమయంలో జరిగిన రెండు సంఘటనలను ప్రస్తావించారు.

ఆర్‌ఎస్‌ఎస్ సంస్థ ఆర్గనైజర్ మనుస్మృతికి సంబంధించి తన ఆలోచనలను బయటపెట్టారని, “మన రాజ్యాంగంలో, ప్రాచీన భారతదేశంలోని విశిష్ట రాజ్యాంగ పరిణామాల గురించి ప్రస్తావించలేదు. మను చట్టాలు లైకర్గస్ ఆఫ్ స్పార్టా లేదా సోలోన్ ఆఫ్ పర్షియా కంటే చాలా కాలం ముందు వ్రాయబడ్డాయి. ఈ రోజు వరకు మనుస్మృతిలో పేర్కొన్న చట్టాలు ప్రపంచం యొక్క ప్రశంసలను ఉత్తేజపరుస్తాయి మరియు ఆకస్మిక విధేయత, అనుగుణ్యతను పొందుతున్నాయి. కానీ మన రాజ్యాంగ పండితులకు ఇవేమీ తెలియదు" అని చెప్పారన్నారు. అలాగే నవంబర్ 25, 1949 న రాజ్యాంగ సభలో డా. బి.ఆర్. అంబేద్కర్ యొక్క ముగింపు వ్యాఖ్యలు ఇలా ఉన్నాయని.. “అసెంబ్లీ నన్ను డ్రాఫ్టింగ్ కమిటీకి ఎన్నుకున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ముసాయిదా కమిటీ నన్ను ఛైర్మన్‌గా ఎన్నుకున్నప్పుడు నేను మరింత ఆశ్చర్యపోయాను. ముసాయిదా కమిటీలో నాకంటే పెద్దవారు, మంచివారు, సమర్థులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ వల్లనే ముసాయిదా కమిటీ ప్రతి ఒక్కరి విధి గురించి ఖచ్చితంగా తెలుసుకుని అసెంబ్లీలో రాజ్యాంగాన్ని ప్రయోగించగలిగింది. కాబట్టి ముసాయిదా రాజ్యాంగాన్ని అసెంబ్లీలో సజావుగా అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. అని చెప్పారని ఖర్గే ఎక్స్ లో రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed