- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వలసలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు.. వారంతా వెనక్కి రావాల్సిందేనా!

దిశ, వెబ్ డెస్క్: డొనాల్డ్ ట్రంప్(Donalrd Trump) రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(S.Jaishankar) హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తొలిసారి భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ వలసలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
భారతీయులకు ప్రపంచస్థాయిలో ఉన్నత అవకాశాలు దక్కాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అందుకే న్యాయపరమైన వలసలకే తాము పూర్తి మద్దతు ఇస్తామని వెల్లడించారు. సరైన పత్రాలు లేని అక్రమ వలసలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. అమెరికా సహా ఏ దేశానికైనా సరే భారత పౌరులు(Indian Migrants) అక్రమంగా వెళ్లినట్లు నిర్థారిస్తే.. వారిని చట్టబద్ధంగా తిరిగి స్వదేశానికి రప్పిస్తామని స్పష్టం చేశారు. కాగా, సరైన పత్రాలు లేకుండా అమెరికా వచ్చిన భారతీయులను వెనక్కి పంపించేందుకు ట్రంప్ నూతన ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టినట్లు వస్తోన్న వార్తలపై అడిగిన ప్రశ్నలకు జైశంకర్ ఈ విధంగా సమాధానమిచ్చారు. అగ్రరాజ్యం పంపించాలనుకుంటున్న భారతీయుల వివరాలను ఢిల్లీ పరిశీలిస్తోందని, ప్రస్తుతానికి ఎంతమంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేమన్నారు.