26 వారాల అబార్షన్‌ అనుమతిపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

by Vinod kumar |
supreme court notices to twitter
X

న్యూఢిల్లీ : 26 వారాల అబార్షన్‌కు అనుమతి ఇవ్వాలంటూ 27 ఏళ్ల గర్భిణి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ మహిళ కడుపులోని పిండం ఏదైనా అసాధారణ సమస్యతో బాధపడుతోందా లేదా అనే దానిపై నివేదిక సమర్పించాలని ఎయిమ్స్​మెడికల్ బోర్డుకు శుక్రవారం ఆర్డర్ ఇచ్చింది. ‘‘ఎయిమ్స్​ ఇంతకుముందు ఇచ్చిన నివేదికలో పిండం సాధారణంగా ఉందని ప్రస్తావించారు.

అయితే దీనిపై సందేహాలకు ఆస్కారం లేకుండా మరో సమగ్ర రిపోర్టును సమర్పించండి’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. అంతకుముందు రోజు (గురువారం) ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ‘‘కోర్టు ఉత్తర్వుల ద్వారా బిడ్డను చంపాలని మీరు అనుమతి కోరుతున్నారా? బతికే అవకాశాలున్న పిండాన్ని చంపేందుకు మేం అనుమతించలేం’’ అని ప్రశ్నించింది.

Advertisement

Next Story