Telegram CEO Pavel Durov : టెలిగ్రామ్ సీఈవో విచిత్ర ఆఫర్

by M.Rajitha |
Telegram CEO Pavel Durov : టెలిగ్రామ్ సీఈవో విచిత్ర ఆఫర్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సీఈవో ఓ వింత ప్రకటన జారీ చేశాడు. సంతానలేక బాధపడుతున్న దంపతుల కోసం టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్(Telegram CEO Pavel Durov) ఈ విచిత్ర ప్రకటన జారీ చేశారు. సంతానం లేక బాధపడుతున్న దంపతులకు ఉచితంగా ఐవీఎఫ్(IVF) చికిత్స అందిస్తానని, అయితే ఆ చికిత్సలో తన వీర్యకణాలు ఉపయోగించుకోవాలని కండిషన్ విధించారు. రష్యా రాజధాని మాస్కోలోని అల్ట్రావిటా క్లినిక్(UltraVita Clinic) జారీ చేసిన ఈ వింత ప్రకటనపై అంతర్జాతీయ మీడియా వివిధ కథనాలు జారీ చేసింది. తమ క్లినిక్ లో ఉన్న దురోవ్ వీర్యకణాలను వాడుకొని ఉచిత ఐవీఎఫ్ చికిత్స పొందవచ్చును, దీనికి గల ఖర్చు అంతా దురోవ్ భరిస్తారని తన వెబ్సైట్ లో పేర్కొంది. కాగా వీర్య కణాల డొనేషన్(Sprem Cells Donation) పై దురోవ్ స్పందిస్తూ.. నాకు పెళ్లి కాలేదు కాని ప్రపంచంలోని వివిధ దేశాల్లో వందమంది దాకా పిల్లలున్నారు. వీరంతా నేను దానం చేసిన స్పెర్మ్ వలన కలిగిన పిల్లలు. దీనిపై నేను చాలా గర్వపడుతున్నాను అని తెలుపుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా సంతనలేమి పెద్ద సమస్యగా మారింది. వీర్యం దానం చేయడం ఒక సామాజిక బాధ్యతగా చూడాలి. అలాంటి బాధ్యత నేను తీసుకున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed