బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులుంటాయా?.. రేవంత్ సర్కార్ ఆశలు

by GSrikanth |   ( Updated:2024-02-01 04:45:43.0  )
బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులుంటాయా?.. రేవంత్ సర్కార్ ఆశలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మధ్యంతర బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం చివరిసారి ప్రవేశ పెడుతున్న బడ్జెట్‌పై అన్ని వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. గురువారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. అయితే, ఇది పూర్తిస్థాయి బడ్జెట్ కాకపోవడం గమనార్హం. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది. మూడోసారి ప్రభుత్వాన్ని స్థాపించాలని తహతహలాడుతున్న బీజేపీ.. దానికనుగుణంగానే అన్ని వర్గాలు సంతృప్తి చెందేలా బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.

అయితే, కొత్తగా తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర ఆశలు పెట్టుకున్నది. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, నిధులు కేటాయింపులు కొంతమేర ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ సహా పలువురు కేంద్రమంత్రులను కలిసి తెలంగాణ ఆర్థిక పరిస్థితిని వివరించిన సాయం చేయాలని కోరినట్లు సమాచారం. పారిశ్రామిక కారిడార్లు, మెట్రో విస్తరణ, పాలమూరుకు నిధులు వస్తాయని ఆశిస్తున్నారు. మరి బడ్జెట్ నిరాశ పరుస్తుందో లేదో చూడాలి.

Read More..

Budget 2024: స్టాక్ మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావం ఉంటుందా?

Advertisement

Next Story

Most Viewed