బెంగాల్ లో ఎన్ఐఏ అధికారులపై దాడి.. ఒకరికి గాయాలు

by Shamantha N |
బెంగాల్ లో ఎన్ఐఏ అధికారులపై దాడి.. ఒకరికి గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈడీ అధికారులపై దాడి మర్చిపోకముందే బెంగాల్ లో మరో దారుణం జరిగింది. బెంగాల్ లోని మేదినీపూర్ జిల్లాలో ఎన్ఐఏ అధికారులప బృందంపై దాడి జరిగింది. ఈదాడిలో అధికారికి గాయాలయ్యాయి. 2022 పేలుడు కేసులో ఇద్దరు టీఎంసీ నేతలను అరెస్టు చేసేందుకు అధికారుల బృందం భూపతినగర్ కు వెళ్లింది. అకస్మాత్తుగా 150 మంది గ్రామస్థులు ఎగబడ్డారు. నిందితులను తీసుకెళ్లకుండా ఎన్ఐఏ బృందాన్ని అడ్డకునే ప్రయత్నం చేశారు. అధికారుల వాహనాలపై రాళ్లతో దాడి చేయడంతో ఒకరికి గాయాలయ్యాయి.

కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు 2022లో జరిగిన పేలుడు కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. గత నెలలో ఎన్ఐఏ 8 మంది టీఎంసీ నేతలను విచారణకు పిలిచింది. మార్చి 28న న్యూ టౌన్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి విచారణ కోసం పిలిచింది. ఇదే కేసులో టీఎంసీ నేత మనోబత్ర జానా, బలై చరణ్ మైతీలను అరెస్టు చేసేందుకు ఎన్ఐఏ బృందం భూపతినగర్ కు వెళ్లింది. కానీ దాడుల సమయంలో అక్కడ ఉన్న గ్రామస్తుల నుంచి ఎన్ఐఏ నిరసనలను ఎదుర్కొన్నారు. నిందితులను తప్పించేందుకు అక్కడి ప్రజలు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఎన్ఐఏ అధికారుల కార్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో కారు విండ్ స్క్రీన్ దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీస్ బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఎన్‌ఐఏ అధికారులు అక్కడికి చేరుకున్నారని పోలీసులు తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులకు ఎన్ఐఏ అధికారులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇక, 2022లో భూపతినగర్‌లోని టీఎంసీ నేత ఇంట్లో పేలుడు సంభవించింది. దీంతో ఇల్లు కూలిపోవడంతో పాటు ముగ్గురు మృతి చెందారు. ఈ కేసు గురించి టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎన్ఐఏ దర్యాప్తు వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందని టీఎంసీ నేత కునాల్ ఘోష్ ఆరోపించారు. బీజేపీ స్వయంగా టీఎంసీ నేతల జాబితాను ఎన్ఐఏకు అందజేసింది అని పేర్కొన్నాడు. అందుకే వారి ఇళ్లపై ఎన్ఐఏ ఏజెన్సీ దాడులు చేస్తోంది అని ఘోష్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed