- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tamil Nadu: ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం.. చిన్నారి సహా ఏడుగురు సజీవ దహనం
దిశ, వెబ్ డెస్క్: ప్రైవేట్ ఆసుపత్రి(Private Hospital)లో ఘోర అగ్ని ప్రమాదం(Major Fire Broke) సంభవించిన ఘటన తమిళనాడు(Tamil Nadu)లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం(Burnt Alive) అయ్యారు. ఘటన ప్రకారం తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లా(Dindigul District)లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. తిరుచ్చి రోడ్డు(Trichy Road)లోని సిటీ హాస్పిటల్ లో గురువారం రాత్రి సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్ది సేపటికే ఆసుపత్రి భవనం చుట్టూ పోగ కమ్ముకున్నది. ఇది గమణించిన హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అంతేగాక ఆసుపత్రిలో ఉన్న రోగులను బయటకి పంపే ప్రయత్నం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు రెండు గంటల సమయం పట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఏడుగురు మంటల్లో సజీవ దహనం కాగా.. మరి కొందరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అయ్యి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.