స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు.. ఆ కారణం వల్లే

by Javid Pasha |
స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు.. ఆ కారణం వల్లే
X

దిశ, వెబ్ డెస్క్: స్కూళ్లకు వేసవి సెలవులను పొడిగిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ అధికమవుతుండటంతో స్టాలిన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో వేసవి సెలవుల అనంతరం జూన్ 1 నుంచి 6-10 తరగతులకు, జూన్ 5వ తేదీ నుంచి 1-5 తరగతులకు స్కూళ్లు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఎండలు తగ్గుముఖం పట్టకపోవడంతో జూన్ 6వ తేదీన తరగతులు నిర్వహించాలని భావించారు. ఇప్పటికీ ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో ఈ నెల 11వ తేదీ వరకు వేసవి సెలవులను పొడగించారు.

2023-24 విద్యాసంవత్సరానికి గానూ 6-10 తరగతులకు, ఇంటర్ విద్యార్ధులకు జూన్ 12, 1-5 తరగతులకు జూన్ 14 నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్లు తమిళనాడు విద్యాశాఖ ప్రకటించింది. ఏపీ, తెలంగాణలో జూన్ 12 నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. కాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా వేసవి సెలవులను పొడిగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed