నిమిషాల్లో ఇంటిముందుకు.. అమెజాన్ ఫ్లిప్ కార్టును తలదన్నేలా స్విగ్గీ బిగ్ డిసిషన్

by Prasad Jukanti |
నిమిషాల్లో ఇంటిముందుకు.. అమెజాన్ ఫ్లిప్ కార్టును తలదన్నేలా స్విగ్గీ బిగ్ డిసిషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో:రోజు రోజుకు ఈ-కామర్స్ సైట్లపై ఆధారపడే వారి సంఖ్య పెరిగిపోతున్నది. అందుకు అనుగుణంగా ఈ కామర్స్ విభాగంలో పోటీ కూడా విపరీతంగా పెరిగిపోయింది. కస్టమర్లకు ఆకట్టుకునేందుకు దిగ్గజ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో క్విక్-కామర్స్ విభాగమైన ఇన్ స్టా మార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్విగ్గీ మాల్ ను ఇన్ స్టా మార్ట్ తో అనుసంధానం చేసినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ గురువారం ప్రకటించింది. స్విగ్గీ మాల్ అనేది అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తరహాలోనే స్పోర్ట్స్ గూడ్స్, ఫుట్ వేర్, దుస్తులు, ఎలక్ట్రానికి, ఎలక్ట్రిక్ ఉపకరణాలు, బొమ్మలు, స్టేషనరీతో పాటు పలు రకాల వస్తువులు డెలివరీ చేసే ఓ ఫ్లాట్ ఫామ్. బుక్ చేసిన గంటలోనే వస్తువులను డెలివరీ చేయడం దీని స్పెషాలిటీ. అయితే స్విగ్గీ మాల్ ను ఇన్ స్టా మార్ట్ తో అనుసంధానం చేయడం ద్వారా ఇకపై నిమిషాల్లోనే వస్తువులను ఇంటి వద్దకు పొందవచ్చని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ అధిపతి ఫణి కిషన్‌ తెలిపారు. ఇన్ స్టా మార్ట్ ఇప్పటి వరకు నిత్యావసర సరుకుల డెలివరీకే పరిమితం కాగా ఇకపై దుస్తులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, స్టేషనరీ ఇలా 35 రకాల వస్తువులను డెలివరీ చేసేందుకు స్విగ్గీ రేడీ అయింది.

Advertisement

Next Story