- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెంటనే లొంగిపోండి: ఆప్ నేతకు సుప్రీంకోర్టు ఆదేశాలు
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత సత్యేందర్ జైన్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఆయన దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ పై ఉన్న ఆయన వెంటనే లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. లొంగిపోయేందుకు వారం రోజులు గడువు కావాలన్న అభ్యర్థనను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో 2022 మే 30న ఈడీ సత్యేందర్ జైన్‌ను అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులోనే ఉండగా..2023 మే 26న ఆరోగ్య కారణాల వల్ల జైన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎప్పటికప్పుడు బెయిల్ సమయాన్ని పొడిగించింది. ఈ క్రమంలోనే సత్యేందర్ జైన్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై సోమవారం న్యాయమూర్తులు బేలా ఎం త్రివేది, పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించింది. మధ్యంతర బెయిల్‌ను సైతం రద్దు చేసింది.