- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాహుల్ గాంధీకి మరో బిగ్ షాక్..
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో తనకు సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించాలని రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ ను సూరత్ సెషన్స్ కోర్టు కొట్టివేసింది. 2019లో కర్ణాటకలో మోడీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన కేసులో దోషిగా తేలడంతో మార్చి 23న సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ పరిణామంతో రాహుల్ గాంధీ తన లోక్ సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోయారు.
దీంతో ఈ కేసులో న్యాయపరమైన పోరాటానికి దిగిన రాహుల్ గాంధీ.. సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను సూరత్ కోర్టు కొట్టివేసింది. దీంతో రాహుల్ లీగల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది. రాహుల్ కు విధించిన శిక్ష అమలు విషయంలో ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో బెయిల్ కాలపరిమితి ముగియగానే ఆయన జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో సూరత్ సెషన్స్ కోర్టు నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించేందుకు న్యాయనిపుణులతో చర్చించే అవకాశం ఉంది.