- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రేషన్ కార్డులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్డెస్క్: రేషన్ కార్డు(Ration Cards)లపై దేశ అత్యున్నత న్యాయమైన సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోనే అనేక చోట్ల రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయని అభిప్రాయపడింది. పేదల ఫలాలు ధనికులు అనుభవిస్తున్నారని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అనర్హుల రేషన్ కార్డుల రద్దు చేయాలని ఆదేశించింది. రేషన్ కార్డులు ప్రదర్శన కోసమే ఉపయోగిస్తున్నాయని పలు రాష్ట్రాలపై కోర్టు మండిపడింది.
కాగా, కొవిడ్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని.. జాతీయ ఆహార భద్రత చట్టం కింద కోటాతో సంబంధం లేకుండా.. ఈ-శ్రమ్ (e-shram Portal) పోర్టల్లో దరఖాస్తు చేసుకున్న వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని గతంలోనే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటివరకు కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేయగా.. మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జాప్యం చేస్తున్నాయి. దీంతో సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read More..