సుప్రీం చేతిలో కేజ్రీవాల్‌ ఫేట్.. బెయిల్ దక్కేనా..?

by karthikeya |   ( Updated:2024-09-13 05:26:50.0  )
సుప్రీం చేతిలో కేజ్రీవాల్‌ ఫేట్.. బెయిల్ దక్కేనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: మద్యం కుంభకోణం కేసులో బెయిల్ (Bail) కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Aravind Kejriwal) ఫేట్ ఈ రోజు తేలబోతోంది. ఈ రోజు (శుక్రవారం) సుప్రీం కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్‌పై తుది తీర్పు వెలువడనుంది. ఈ కేసులో సెప్టెంబర్ 5న జరిగిన విచారణ అనంతరం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. కాగా.. మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admy Party) చీఫ్‌ను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 5న ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించి ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఇచ్చిన ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కాగా.. కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ జరిపిన రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టు (Rauz Avenue Special Court) బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ పిటిషన్‌‌పై సుప్రీం కోర్టు కూడా విచారణ చేపట్టింది. బెయిల్‌పై బయటకు వస్తే.. ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన వాదనలు వినిపించగా.. సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్‌లో పెట్టిన ధర్మాసనం.. ఈ రోజు తుది తీర్పు వెలువరించనుంది.

ఇదిలా ఉంటే ఇదే కేసులో అక్రమ లావాదేవీలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసు (Money Laundering)లో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేయగానే.. జులై 12న సుప్రీంకోర్టు (Supeme Court) మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కానీ సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఇప్పటికీ ఆయన జైల్లోనే ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed