స్వలింగ వివాహాల తీర్పుపై రివ్యూ పిటిషన్లు.. జూలై 10న విచారించనున్న సుప్రీంకోర్టు

by vinod kumar |
స్వలింగ వివాహాల తీర్పుపై రివ్యూ పిటిషన్లు.. జూలై 10న విచారించనున్న సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్ 17న దీనిపై తీర్పు వెల్లడించింది. అయితే ఈ తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను జూలై 10వ తేదీన ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సంజీవ్ ఖన్నా, హిమా కోహ్లీ, బీవీ నాగరత్న, పీఎస్ నరసింహలతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించనుంది. అయితే రివ్యూ పిటిషన్‌లో న్యాయమూర్తులు కొంత మెరుగైందని భావిస్తే..వారు బహిరంగ కోర్టు విచారణ, మౌఖిక వాదనలను అనుమతించొచ్చు. ఈ కేసులో ఓపెన్ కోర్టు విచారణ జరపాలని కూడా పిటిషనర్లు డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ పిటిషన్లను జాబితా చేశారు.

కాగా, గతేడాది తీర్పులో సుప్రీంకోర్టు గే వివాహాలను చట్టబద్దత కల్పించేందుకు నిరాకరించింది. ఈ విషయాన్ని రాష్ట్రాల శాసనసభలు నిర్ణయించాల్సి ఉంటుందని తెలిపింది. అయితే హింస, బలవంతం లేకుండా సహజీవనం చేసే హక్కు ఉందని పేర్కొంది. కానీ వివాహాలు వంటి సంబంధాలను అధికారికంగా గుర్తించడానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి.

Next Story