మీడియేటర్ గా పనిచేసి... ఏసీబీకి చిక్కి...

by Kalyani |
మీడియేటర్ గా పనిచేసి... ఏసీబీకి చిక్కి...
X

దిశ, భిక్కనూరు : విలేఖరి ముసుగులో మీడియేటర్ గా పనిచేస్తూ... మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ ఎస్సై ఆనంద్ గౌడ్ తరపున 20 వేల లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన మస్తాన్ ఏసీబీకి చిక్కాడు. ఈ మేరకు మెదక్ ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ ఇసుక వాహనం రిలీజ్ కోసం 30 వేల రూపాయల లంచం ఎస్సై ఆనంద్ గౌడ్ డిమాండ్ చేయగా, మీడియేటర్ గా పని చేస్తున్న మహమ్మద్ మస్తాన్( ఒక పత్రికకు విలేఖరి) కు లంచం డబ్బులు అప్పగించాలని చెప్పడంతో, అప్పటికే మాటు వేసిన ఏసీబీ సిబ్బంది డబ్బు తీసుకున్న వెంటనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

అయితే ఎస్ఐ ఆనంద్ గౌడ్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో పని చేసినప్పటి నుంచే మస్తాన్ కు పరిచయం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అక్కడి నుంచి బదిలీపై భిక్కనూరు ఎస్ఐగా వచ్చిన సమయంలో మరింత పరిచయం పెరిగి, మస్తాన్ నమ్మకస్తుడు గా మారాడు. అతని ద్వారానే ఇరువురు చాలా కేసులు డీల్ చేసి, అతని ద్వారానే లంచం తీసుకునేవాడని చెబుతున్నారు. ఇక్కడి నుంచి ఆనంద్ గౌడ్ హవేలీ కి ఘన్ పూర్ కు బదిలీ అయినప్పటికీ, ఆ పోలీస్ స్టేషన్ లో కూడా మస్తాన్ ద్వారానే లంచాలు తీసుకుంటూ ఇరువురు ఏసీబీకి చిక్కడం కామారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించింది.

Advertisement

Next Story