Supreme Court: బెంగాల్, కేరళ గవర్నర్ కార్యాలయాలకు షాకిచ్చిన సుప్రీం కోర్టు.. ఆ విషయంలో నోటీసులు జారీ

by Shiva |   ( Updated:2024-07-26 09:08:29.0  )
Supreme Court: బెంగాల్, కేరళ గవర్నర్ కార్యాలయాలకు షాకిచ్చిన సుప్రీం కోర్టు.. ఆ విషయంలో నోటీసులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: సరైన కారణం లేకుండా గవర్నర్ కార్యాలయంలో బిల్లుల పెండింగ్‌ సంబంధించి కేరళ, బెంగాల్ ప్రభుత్వాలు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ మేరకు ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పరిద్వాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేంద్ర హోంశాఖకు, గవర్నర్‌ కార్యదర్శులకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. కాగా, అసెంబ్లీల్లో తీర్మాణం చేసిన బిల్లులు రాష్ట్రపతికి పంపాల్సి ఉండగా.. కావాలనే గవర్నర్ కార్యాలయాలు ఆలస్యం చేస్తున్నాయంటూ కేరళ, బెంగాల్ సర్కార్లు పిటిషన్లలో పేర్కొన్నాయి. ఏడాది కావొస్తున్నా మొత్తం ఎనిమిది బిల్లులు గవర్నర్ ఆమోదం పొందలేదని తెలిపారు. అదేంటని ప్రశ్నిస్తే.. ఆలస్యానికి గల కారణం చెప్పట్లేదని పిటిషన్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదలను విన్న త్రిసభ్య ధర్మాసనం కేంద్ర హోంశాఖకు, కేరళ, బెంగాల్ గవర్నర్‌ కార్యదర్శులకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed