Supreme Court: మదర్సాల విషయంలో ఎన్సీపీసీఆర్ సిఫార్సులపై సుప్రీంకోర్టు స్టే

by Shamantha N |
Supreme Court: మదర్సాల విషయంలో ఎన్సీపీసీఆర్ సిఫార్సులపై సుప్రీంకోర్టు స్టే
X

దిశ, నేషనల్ బ్యూరో: మదర్సాల విషయంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) సిఫార్సులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. విద్యాహక్కు చట్టాన్ని (RTE) పాటించడం లేదని ఆరోపిస్తూ ప్రభుత్వ నిధులతో నడిచే మదర్సాలను మూసివేయాలని కేంద్రం, రాష్ట్రాలు తీసుకున్న తదుపరి చర్యలపైన సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. ఉత్తరప్రదేశ్, త్రిపుర ప్రభుత్వాలు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను కూడా కోర్టు నిలిపివేసింది. గుర్తింపు లేని మదర్సాలు అలాగే ప్రభుత్వ-ఎయిడెడ్ మదర్సాలలో చదువుతున్న ముస్లిమేతర విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ చేయాలన్న సూచనలపైనా స్టే విధించింది. ఈ ఏడాది జూన్‌ 7, జూన్‌ 25 తేదీల్లో జారీ చేసిన ఎన్‌సీపీసీఆర్‌ కమ్యూనికేషన్‌లపై చర్య తీసుకోరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది.

కేంద్రానికి నోటీసులు

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ జమియత్ ఉలమా-ఇ-హింద్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోరుతూ కేంద్రం, అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి నోటీసు వచ్చేవరకు రాష్ట్రాలు జారీ చేసే ఉత్తర్వులు కూడా నిలిపివేయాలని కోర్టు తీర్పు చెప్పింది. అదనంగా, పిటిషన్‌లో ప్రతివాదులుగా ఉత్తరప్రదేశ్, త్రిపుర సహా ఇతర రాష్ట్రాలను చేర్చడానికి జమియత్ ఉలమా-ఇ-హింద్‌కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed