దివ్యాంగుల చట్టం అమలులో విఫలమైనందుకు కేంద్రంపై మండిపడ్డ సుప్రీంకోర్టు

by S Gopi |
దివ్యాంగుల చట్టం అమలులో విఫలమైనందుకు కేంద్రంపై మండిపడ్డ సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: దివ్యాంగుల చట్టంలోని నిబంధనలు పాటించడంలో అలసత్వంపై భారత అత్యున్నత న్యాయస్థానం కేంద్రంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిబంధనల అమలుతో పాటు బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయడంలో విఫలమైనందుకు మండిపడింది. ఓ దివ్యాంగ అభ్యర్థి వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పైవ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో 2009లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్(సీఎస్ఈ)లో ఉత్తీర్ణత సాధించిన 100 శాతం దృష్టి లోపం ఉన్న అభ్యర్థిని మూడు నెలల్లోగా నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పీడబ్ల్యూడీ చట్టం, 1995లోని నిబంధనలను సత్వరం అమలు చేయడంలో భారత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారంలో అప్పీలుదారు అన్ని దశల్లో దివ్యాంగుల ప్రయోజనాల లక్ష్యాల పట్ల అలసత్వం ప్రదర్శించారు. ప్రభుత్వం దివ్యాంగుల చట్టం అమలు చేసి ఉంటే ప్రతివాది(దృష్టి లోపం ఉన్న వ్యక్తి) న్యాయం కోసం ఇంత కష్టపడాల్సి వచ్చేది కాదని' ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, 100 శాతం దృష్టి లోపం పంకజ్ కుమార్ శ్రీవాస్తవ 2008లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌కు హాజరయ్యారు. వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ తర్వాత శ్రీవాస్తవ అపాయింట్‌మెంట్‌ను నిరాకరించారు. అతను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌(క్యాట్)ను ఆశ్రయించాడు. దీనిపై 2010లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్‌ను ఆరు నెలల్లోగా పీడబ్ల్యూడీ చట్టం, 1995 ప్రకారం బ్యాక్‌లాగ్ ఖాళీలను లెక్కించాలని ఆదేశించింది. తదనంతర పరిణామాల్లో ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో క్యాట్ తీర్పును సవాలు చేయగా, కోర్టు అప్పీల్‌ను కొట్టివేసింది. దీంతో కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Advertisement

Next Story

Most Viewed