కోల్‌కతా వైద్యురాలి ఘటన.. వెంటనే వాటిని తొలగించాలని సుప్రీం ఆదేశాలు

by M.Rajitha |
కోల్‌కతా వైద్యురాలి ఘటన.. వెంటనే వాటిని తొలగించాలని సుప్రీం ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ మెడికల్ కాలేజీ ట్రైనీ వైద్యురాలి దారుణ హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ తీవ్ర అలసత్వం వలన కేసును సీబీఐకి బదిలీ చేస్తూ కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ కేసును సుమోటోగా తీసుకున్న దేశ అత్యున్నత నాయస్థానం ఈరోజు విచారణ చేపట్టింది. విచారణలో పలు విషయాలు ప్రస్తావించిన కోర్ట్.. ఈ ఘటనలో మృతురాలి పేరు, ఫోటోలు, వీడియోలు బయటికి రావడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వీటన్నిటి తొలగించాలని అన్ని మీడియా ఫ్లాట్ ఫామ్స్ కు సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఇది బాధితురాలి గోప్యతకు భంగం వాటిల్లే చర్య అంటూ.. ఈ వివరాలను బహిర్గతం చేసిన మీడియా సంస్థల పట్ల మండిపడింది. కాగా ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని తప్పు పట్టింది సర్వోన్నత న్యాయస్థానం. నిందితుణ్ణి అరెస్ట్ చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు జాప్యం చేసారంటూ అగ్రహించింది.

Next Story

Most Viewed