- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మసీదు తొలగింపును మూడు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
లక్నో: అలహాబాద్ హైకోర్టు ఆవరణలో ఉన్న మసీదు పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మూడు నెలల్లోపు హైకోర్టులోని మసీదును తొలగించాలని జస్టిస్ ఎం ఆర్ షా, సీటీ రవి కుమార్‌ల బెంచ్ పేర్కొంది. అంతకుముందు అలహాబాద్ హైకోర్టు కూడా ఇదే ఆదేశాలను జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, వక్ఫ్ మసీదు హైకోర్టు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. అయితే దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. మసీదును ప్రాంగణం నుండి తరలించడానికి మూడు నెలల సమయం ఇచ్చింది. అంతేకాకుండా వేరే ప్రాంతంలో మసీదును ఏర్పాటు చేసుకోవాలని యూపీ ప్రభుత్వానికి సూచించింది. భూమి లీజు ప్రాపర్టీ అని.. అది రద్దు చేయబడిందని.. దానిని కొనసాగించడానికి అనుమతించలేమని పిటిషనర్లకు తెలిపింది.
అయితే ఈ పిటిషన్ తప్పుడు అని హైకోర్టు తరుపు న్యాయవాది రాకేష్ ద్వివేది వాదించారు. మసీదును తరలించేందుకు కొంత భూమిని ఇచ్చే అవకాశాలను అన్వేషించాలని గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. మసీదును తరలించడానికి తమ వద్ద ప్రత్యామ్నాయ స్థలం లేదని రాకేష్ చెప్పారు. ఇప్పటికే పార్కింగ్‌కు స్థలం కొరత ఉందని కూడా చెప్పారు. దీంతో ప్రభుత్వమే ల్యాండ్ చూపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.