ఢిల్లీ ఎల్జీకి సుప్రీం నోటీసులు

by S Gopi |   ( Updated:2023-02-08 12:28:01.0  )
ఢిల్లీ ఎల్జీకి సుప్రీం నోటీసులు
X

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నిక నిర్వహణపై వివరణ కోరుతూ సుప్రీంకోర్టు లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు నోటీసులు జారీ చేసింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో నామినేట్ చేసిన సభ్యులకు ఓటు వేసేందుకు అనుమతివ్వడాన్ని సవాల్ చేస్తూ ఆప్ దాఖలు చేసిన పిటిషన్ పై వివరణ ఇవ్వాలని కోరింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. సోమవారం మూడోసారి మేయర్ ఎన్నిక చేపట్టగా ఆప్, బీజేపీ ఘర్షణతో వాయిదా పడింది. ఈ క్రమంలో ఎల్జీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ త్వరగా ఎన్నికలు చేపట్టాలని ఆప్ తోపాటు పార్టీ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్‌తో కలసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన వివరణ ఇచ్చుకోవాలని ఎల్జీ కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది.

Advertisement

Next Story