Supreme Court: ఈఎస్ఐసీ కేసులో కీలక పరిణామం.. మాజీ ఎంపీ జయప్రదకు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్

by Shiva |
Supreme Court: ఈఎస్ఐసీ కేసులో కీలక పరిణామం.. మాజీ ఎంపీ జయప్రదకు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎంపీ, అలనాటి సినీనటి జయప్రదకు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఈ మేరకు ఈఎస్ఐసీ కేసులో ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అయితే, అదే తీర్పును జయప్రద మద్రాస్ హైకోర్టులో సవాల్ చేసినా లాభం లేకపోవడంతో ఆమె ఎట్టకేలకు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జయప్రద దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం మద్రాస్ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. థియేటర్ ఉద్యోగులకు జయప్రద ఈఎస్ఐసీ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్) కింద రూ.8,17,794 చెల్లించాల్సి ఉండగా.. జయప్రద నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లు కార్మికులు ఫిర్యాదు చేశారు. ఆయా పరిణామాలతో జయప్రద, ఆమె సోదరుడు రాజబాబు, మరికొందరిపై కేసు నమోదైంది. అయితే, ఆ కేసులోనే ఎగ్మోర్ మెట్రోపాలిటన్ కోర్టు జయప్రదకు ఆరు నెలల శిక్ష విధించింది.

Advertisement

Next Story