రెజ్లర్ల ఆరోపణలు తీవ్రమైనవి.. విచారణ అవసరం!

by GSrikanth |
రెజ్లర్ల ఆరోపణలు తీవ్రమైనవి.. విచారణ అవసరం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సీజేఐ డి.వై. చంద్రచూడ్ నేృత్వంలోని ధర్మాసనం దీనిపై ఏప్రిల్ 28న విచారణ చేపడతామని తెలిపింది. రెజ్లర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్‌ను స్వీకరించిన సీజేఐ డి.వై. చంద్రచూడ్ నేృత్వంలోని ధర్మాసనం.. పిటిషనర్ల ఆరోపణలు తీవ్రమైనవని, వాటిని విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ అంశంలో తమ స్పందన తెలియజేయాలంటూ ఢిల్లీ పోలీసులకు మంగళవారం సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. అలాగే ఈ కేసులో ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచేందుకు జ్యుడిషియల్ రికార్డుల నుంచి ఆ ఏడుగురు రెజ్లర్ల పేర్లను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed