ఇండియా కూటమి 'న్యాయ్ ఉల్గులన్ ర్యాలీ'లో పాల్గొననున్న సునీతా కేజ్రీవాల్

by Disha Web Desk 17 |
ఇండియా కూటమి న్యాయ్ ఉల్గులన్ ర్యాలీలో పాల్గొననున్న సునీతా కేజ్రీవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్న నేపథ్యంలో పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నటువంటి ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ ఏప్రిల్ 21న జార్ఖండ్‌లోని రాంచీలో ఇండియా కూటమి నిర్వహించనున్నటువంటి “న్యాయ్ ఉల్గులన్ ర్యాలీ”లో ఆమె పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా పాల్గొంటారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టుకు నిరసనగా ప్రభాత్ తారా గ్రౌండ్ వద్ద ఇండియా కూటమి ర్యాలీ నిర్వహించనుంది.

అంతకుముందు ఉల్గులన్ ర్యాలీని విజయవంతం చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ ఏప్రిల్ 6న పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. దానికి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ గులాం అహ్మద్ మీర్, రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ తదితరులు హాజరయ్యారు. సమావేశం అనంతరం కల్పనా సోరెన్ మీడియాతో మాట్లాడుతూ, జార్ఖండ్‌పై కేంద్ర ప్రభుత్వం ఎలా వివక్ష చూపుతుందో చెబుతాం, హేమంత్ జీ జైలు పాలయ్యాడు, అరవింద్ కేజ్రీవాల్‌ గారిని కూడా జైలులో పెట్టారు. ర్యాలీలో పార్టీ సభ్యులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను, కూటమిని బలోపేతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. జార్ఖండ్‌లో మే 13, 20, 25, జూన్ 1 తేదీల్లో నాలుగు దశల్లో ఓటింగ్ జరగనుంది.

Next Story

Most Viewed

    null