- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నన్నే గుండు అంటావా నిన్న పొట్టొడా అనలేనా?.. హిస్టరీలో 420 గానే మిగులుతావ్.. రేవంత్ రెడ్డిపై అర్వింద్ సీరియస్
దిశ, డైనమిక్ బ్యూరో:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివన్ని గాలి మాటలు, గాలి చేష్టలు అని, చరిత్రలో రేవంత్ రెడ్డి 420 గానే మిగిలిపోతారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారెంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లీంచేందుకే కాంగ్రెస్ పార్టీ పదే పదే రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకువస్తోందని మండిపడ్డారు. బుధవారం నిజామాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన అర్వింద్.. ఇవాళ కోరుట్ల సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి తీరుతో కోరుట్ల సభను పిల్లల చేష్టలు, వీధినాటకాంగా మార్చారని ఎద్దేవా చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లును ఎవరూ ముట్టుకోరని జహీరాబాద్ సభలో ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చినా కానీ రేవంత్ రెడ్డి మళ్లీ అవే వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ ప్రజలను గందరగోళం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డికి హిందీ రాదా అని ప్రశ్నించారు. ముస్లింల కోసం ఏదైనా చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి నీయత్ లేదని, ఇతర వర్గాల రిజర్వేషన్లను లాక్కుని ముస్లింలకు ఇవ్వడం ఏంటని నిలదీశారు. ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలకు నరేంద్ర మోడీ రిజర్వేషన్లు కల్పించారని ఆ 10 శాతం కోటాలో ముస్లింలు కూడా రిజర్వేషన్లు ఉపయోగించుకోవచ్చన్నారు. కేవలం మత ప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్లను మాత్రమే నరేంద్ర మోడీ తొలగిస్తానని చెప్పారన్నారు. ఈ విషయంలో ముస్లింలు ఆలోచించాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా?:
ముఖ్యమంత్రి నన్ను గుండు అంటున్నాడు. నేను అతడిని పాలమూరు పొట్టోడు అనలేనా? అని మండిపడ్డారు. గతంలో చెప్పినట్లుగా కేసీఆర్ అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత తన భాషను మారింది. కానీ రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే మళ్లీ పాత రోజులు తెచ్చాలా ఉన్నాడు. రేవంత్ రెడ్డికి ఆయన భాషలోనే, ఆయన మాటలోనే రియాక్ట్ అయితే రాష్ట్ర రాజకీయాల్లో హుందాతనం మళ్లీ పోతుందన్నారు. మోడీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారంటూ కోరుట్ల సభలో గాడిద గుడ్డు ఆకారాన్ని చూపెట్టడంపై స్పందిస్తూ ఎక్కడైనా గాడిద గుడ్డు పెడుతుందా? ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా? అది గాడిద గుడ్డా లేక రాహుల్ గాంధీ గుడ్డా అంటూ సెటైర్ వేశారు. దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి అత్యంత ముఖ్యమైన ఎజెండాతో ఈ ఎన్నికలు జరుగుతుంటే ముఖ్యమంత్రికి సీరియస్ నెస్ లేదని విమర్శించారు. రైతులపై రేవంత్ రెడ్డి రోజుకో స్టేట్ మెంట్ ఇస్తున్నారని దుయ్యబట్టారు.
జీవన్ రెడ్డి దొంగ ఎటాక్ చేయించుకుంటారు:
రుణమాఫీ చేస్తే రైతులు సోమరులు అవుతారని బీజేపీ చెప్పినట్లుగా జీవన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి వయసుకు దగ్గ పని చేయాలి కదా అని సీరియస్ అయ్యారు. 70 ఏళ్ల వయసులో జీవన్ రెడ్డికి ఇవేం అబద్దాలు, అసలు అయనను 15వ సారి ఎవరు పోటీకి దిగమన్నారు అంటూ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు తొండికి దిగుతున్నారని రాబోయే కాలంలో జీవన్ రెడ్డి తనకు తానే దొంగ ఎటాక్ చేయించుకుని బీజేపీపై నెట్టబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డిలా తనకు పదవి కోసం యావ లేదని నరేంద్ర మోడీ కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు. నిజామాబాద్ లో భారీ మెజార్టీతో బీజేపీ గెలబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు.
Read More...
దోపిడీ మాత్రమే తెలిసిన గాడిదలకు గాడిద గుడ్డే కనిపిస్తుంది: బండి సంజయ్