సూడాన్‌లో పరిస్థితులను గమనిస్తున్నాం.. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్

by vinod kumar |
సూడాన్‌లో పరిస్థితులను గమనిస్తున్నాం.. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: సూడాన్ రాజధాని ఖార్జూమ్‌లోని యూఏఈ రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన దాడి తర్వాత ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. సూడాన్‌లోని భద్రతా పరిస్థితులను సమీక్షిస్తున్నామని తెలిపారు. ఏదైనా వివాదంలో దౌత్యపరమైన ప్రాంగణాల ఉల్లంఘనను గౌరవించాలని పేర్కొన్నారు. దాడికి సంబంధించిన నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. కాగా, ఇటీవల ఖార్టూమ్‌లోని తమ రాయబారి నివాసంపై సూడాన్ సైనిక విమానం దాడి చేసిందని యూఏఈ ఆరోపించింది. భవనం తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపింది. ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. అయితే సూడాన్ సైన్యం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. తమ ప్రత్యర్థి ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(ఆర్ఎస్ఎఫ్) పిరికి చర్యలకు పాల్పడుతోందని తెలిపింది. దీంతో సూడాన్, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

Next Story

Most Viewed