- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశానికి అతిపెద్ద సమస్య కాంగ్రెస్సే: యోగి ఆదిత్యనాథ్
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ ఫైర్‌బ్రాండ్ యోగి ఆదిత్యనాథ్ కాంగెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ 'ఉగ్రవాద అనుమానితుల' పట్ల మెతకగా వ్యవహరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ తన పాలనలో పేదలు ఆకలితో అలమటిస్తే, ఉగ్రవాదులకు మాత్రం బిర్యానీ పెట్టి పోషించిందన్నారు. రాజస్థాన్‌లోని లాల్‌సోట్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ఆయన..దేశానికి కాంగ్రెస్ పార్టీనే అతిపెద్ద సమస్య. కర్ఫ్యూలు విధించడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది. ఆ పార్టీ పేదలను ఆకలితో చంపుతుంది, కానీ ఉగ్రవాదులకు బిర్యానీ తినిపిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనకు ఎలాంటి విధానాలు ఉండవు. కీలక నిర్ణయాలు తీసుకోలేదు. అదే బీజేపీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు వచ్చాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్ఠ పెరిగింది. గడించిన నాలుగేళ్ల కాలంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందుతోంది. ఇక, దేశంలో ఉగ్రవాదం ముగిసింది. దేశవ్యాప్తంగా ప్రజలు మరోసారి మోడీ నాయకత్వం కావాలని ఆశిస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. జమ్మూకశ్మీర్‌పై కాంగ్రెస్ రుద్దిన ఆర్టికల్ 370ని శాశ్వతంగా రద్దు చేశామని యోగి చెప్పారు. అంతేకాకుండా అయోధ్య రామమందిర నిర్మాణం గురించి ప్రస్తావిస్తూ.. కరోనా సమయంలో కాంగ్రెస్‌తో సహా పలు పార్టీలు కనిపించకుండా పోతే.. మోడీ మాత్రమే తన గురించి పట్టించుకోకుండా అవిశ్రాంతంగా కృషి చేశారని పేర్కొన్నారు.