మెట్లబావి ప్రమాదం.. 35కి చేరిన మృతుల సంఖ్య

by Sathputhe Rajesh |
మెట్లబావి ప్రమాదం.. 35కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకున్న ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మెట్ల బావి కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 35 కు చేరింది. పలువరి ఆచూకీ గల్లంతైంది. సీతా రాముల హోమం చేస్తుండగా మెట్లబావి ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలో ఊహించని విధంగా 50 అడుగుల లోతున్న బావిలో జనం పడిపోయారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నిర్లక్ష్యం ఎవరిదో తేల్చాలని ఆదేశించింది. బావిలో పడిన భక్తులను వెలికి తీసేందుకు సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది.

Advertisement

Next Story