సిసోడియాకు నిరాశ.. బెయిల్ నిరాకరించిన కోర్టు

by Dishanational6 |
సిసోడియాకు నిరాశ.. బెయిల్ నిరాకరించిన కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతకు నిరాశే ఎదురైంది. సిసోడియా రెండోసారి బెయిల్ పిటిషన్ ను కొట్టేసవింది ఢిల్లీ కోర్టు. బెయిల్ మంజూరు చేసేందుకు ఇది సరైన స్టేజ్ కాదని పేర్కొన్నారు. సిసోడియాకు బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ, ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న తర్వాత కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని సవరించేటప్పుడు అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపించింది. లైసెన్స్ హోల్డర్లకు అక్రమంగా సహకరించారని పేర్కొంది. కొందరికి లైసెన్స్ రుసుము మినహాయించారని.. మరికొందరికి తగ్గించారని.. కొందరికి లైసెన్స్ లు పొడిగించారని సీబీఐతో పాటు ఈడీ ఆరోపించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు అక్రమంగా లాభాలను మళ్లించారని.. ఖాతా పుస్తకాల్లో తప్పుడు సమాచారం నమోదు చేశారని ఆరోపించాయి.

ఇకపోతే, ఢిల్లీ లిక్కర్ స్కాంలో గతేడాది ఫిబ్రవరి 26న సిసోడియాను అరెస్ట చేసింది సీబీఐ. మనీలాండరింగ్ కేసులో గతేడాది మార్చి 9న ఈడీ సిసోడియాను అదుపులోకి తీసుకుంది. గతేడాది ఫిబ్రవరి 28న మంత్రి పదవికి రాజీనామా చేశారు సిసోడియా.

Next Story

Most Viewed